Tonsils symptoms , Causes , Treatment
ట్రాన్సిల్స్ అంటే ఏంటి ?
తెలుగులో గవత బిళ్ళలు అని అంటారు. ఇవి గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. గొంతులో పైన కింద ఎక్కడైనా ఉండవచ్చు. నొప్పిగా ఉంటాయి రాళ్ల లాగా ఉంటాయి. రెగ్యులర్ గా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది ఇది చిన్న పిల్లల్లో అతి సాధారణమైన విషయం.
ఎందుకు వస్తాయి ?
చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా చాలామంది లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి. లేదా చల్లనివి ఎక్కువగా తీసుకున్న ఐస్ క్రీం ఐస్ వాటర్ చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకున్న వారిలో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్ ని మనం చూస్తాం.
వీటి లక్షణాలు ఎలా ఉంటాయి ?
గొంతు వాయడం తరచుగా గొంతు నొప్పి రావడం ఈ నొప్పి 48 గంటలు కంటే ఎక్కువగా ఉండటం . చెవి నొప్పి, రాత్రిపూట ఎక్కువగా నోరు తడి బారాడం , తలనొప్పి ఎక్కువగా రావడం, జ్వరం రావడం అతిగా చలివేయడం.
ఈ లక్షణాలతో పాటు ఈ లక్షణాలు కూడా చూపించడం
ఈ సమస్య మరి ఎక్కువ అయినట్లు అయితే tonsils వాపు పెద్దగా అయ్యి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.తినేటప్పుడు మరియు తాగేటప్పుడు ఇబ్బంది కలగడం.
Infection Tonsils ని ఎలా గుర్తుపట్టడం?
ఇవి సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి.
అలా కాకుండా ఎరుపు రంగులో మారినట్లయితే మరియు వాటి పైన తెల్లటి మచ్చలు ఉన్నట్లయితే అవి టోన్సిల్స్ గా గుర్తిచాలి..
దవడ మరియు మెడలోని శోషరస కణుపులు వాపు మరియు స్పర్శకు మృదువుగా ఉండవచ్చు.
ఉపశమనం
- వెచ్చగా ఉండే ఉప్పునీటిని పుక్క లించండి
- గోరువెచ్చని నీటిని తాగుటం
చికిత్స
మీ tonsils నొప్పి కలిగించకపోయినా లేదా మరి ఏ ఇతర ప్రాబ్లం కలిగించానటువంటి tonsil వాపు కి చికిత్స అవసరం లేదు..
అలాకాకుండా మీకు విపరీతమైన నొప్పి వచ్చిన మరియు వాపు వచ్చిన మరి ఏ ఇతర సమస్యలు వచ్చిన వెంటనే మీరు మీ డాక్టర్ ని సంప్రదించాలి.