వాలంటీర్ల సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల సమాచారం | Grama Ward Volunteers Awards 2023

Grama Ward Volunteer Awards lists 2023 | Volunteer Awards 2023 | Seva Mitra | Seva Ratna | Seva vajra | AP Grama Volunteer Merit List 2023 | Ugadi volunteer ugadi puraskaralu 2023 grama volunteer list village wise gsws volunteers Ugadi Awards 2023

 

Latest Awards Information :

  • వాలంటీర్ల ప్రశంసా కార్యక్రమము 2023” ను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు తేదీ మే 19,  2023న విజయవాడ,కృష్ణ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమమును Volunteers Appreciation Programme (VAP)  అని పిలవటం జరుగును.
  • తేదీ మే 19  ,2023 నుండి ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ల ప్రశంస కార్యక్రమము తప్పనిసరిగా జరుగుతుంది.
  • రోజుకు రెండు సచివాలయాలు చొప్పున , ఒక నెలలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలొ ఈ కార్యక్రమమును కు సంబంధించి ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తూ తో కూడిన షెడ్యూల్ ను తేదీ 18 మే 2023 లోపు ప్రతి జిల్లా కలెక్టర్ వారు గ్రామ వార్డు సచివాలయ శాఖకు తెలియజేయడం జరుగును.
  • ప్రతి జిల్లాకు గ్రామ వార్డు సచివాలయ శాఖసన్మానముకునకు సంబంధించి సర్టిఫికెట్లు,సాల్వాలు ,బ్యాడ్జ్ లు మరియు మెడలను పంపించడం జరుగును. ప్రతి జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ నోడల్ అధికారి వారు సంబంధిత మెటీరియల్ లను ఆయా సచివాలయాలకు ముందుగానే చేరుకునే విధంగా చూస్తారు.
  • సేవ వజ్రా అందుకునే వారికి రూ.30,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ మరియు మెడలు ఇవ్వడం జరుగును.
  • సేవ రత్న అందుకునే వారికి రూ.20,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ మరియు మెడలు ఇవ్వడం జరుగును.
  • సేవ మిత్ర అందుకునే వారికి రూ.10,000/- నగదు, సర్టిఫికెట్, శాలువా మరియు బ్యాడ్జ్ ఇవ్వడం జరుగును. మెడలు ఇవ్వబడదు.
  • సంబంధిత జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు సంబంధిత MPDO / MC వారు ఈ సన్మాన కార్యక్రమమునకు ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తారు. సచివాలయాలకు సంబంధించి నోడల్ అధికారిని ఎవరైతే జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారో వారు తప్పనిసరిగా హాజరు అవ్వవలసి ఉంటుంది. అందరూ సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు హాజరు అవ్వవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాంను సంబందించిన DLDO మరియు గ్రామ వార్డు సచివాలయ శాఖ జిల్లా ఇన్చార్జి వారు మానిటర్ చేస్తార
  • ప్రస్తుతానికి జిల్లాల వారీగా లిస్ట్ లు ఇంకా విడుదల అవ్వలేదు.


Download Volunteer Awards Memo


.
2023 అవార్డులకు పరిగనించే విషయాలు :

  1. వలంటీర్ల పనితీరు,
  2. ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి,
  3. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజరు.
  4. ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ,
  5. వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు,వివరాల నమోదు

తదితర అంశాల ఆధారంగా సేవా వజ్ర, సేవారత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు.

2023 Awards List :

జిల్లా సేవ మిత్ర సేవ రత్న సేవ వజ్ర
Srikakulam Click Here Click Here Click Here
Parvathipuram Manyam Coming Soon Coming Soon Coming Soon
Vizianagaram Click Here Click Here Click Here
Visakhapatnam Click Here Click Here Click Here
Alluri Sitharama Raju Coming Soon Coming Soon Coming Soon
Anakapalli Click Here Click Here Click Here
Kakinada Click Here Click Here Click Here
Kakinada Click Here Click Here Click Here
East Godavari Coming Soon Coming Soon Coming Soon
Konaseema Click Here Click Here Click Here
Eluru Click Here Click Here Click Here
West Godavari Click Here Click Here Click Here
NTR Coming Soon Click Here Click Here
Krishna Click Here Click Here Click Here
Palnadu Click Here Click Here Click Here
Guntur Click Here Click Here Click Here
Bapatla Click Here Click Here Click Here
Prakasam Click Here Click Here Click Here
Sri Potti Sriramulu Nellore Click Here Click Here Click Here
Kurnool Click Here Click Here Click Here
Nandyal Click Here Click Here Click Here
Anantapuramu Click Here Click Here Click Here
Sri Sathya Sai Click Here Click Here Click Here
YSR Click Here Click Here Click Here
Annamayya Click Here Click Here Click Here
Tirupati Click Here Click Here Click Here
Chittoor Coming Soon Coming Soon Coming Soon

 

1.  కొవ్వూరు డివిజన్ సేవా వజ్ర లిస్ట్ : Click Here

01-03-2023 Information :

  • గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న మరియు సేవా వజ్ర పురస్కారాలను అందించనున్నారు.
  • ఈ నెల అనగా మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల పేర్లను ప్రకటించటం జరుగును. వాటికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందించటం జరుగును. 
  • వాలంటీర్ల అవార్డులకు ముఖ్యంగా హాజరు,పెన్షన్ పంపిణి, ఫీవర్ సర్వే మరియు ఇతర సర్వే లు పరిగణలోకి తీసుకోవటం జరుగును. 
  • ఈ సంవత్సరం కు సంబందించిన జిల్లాల వారీగా సెలెక్ట్ అయిన వారి లిస్ట్ త్వరలో పోస్ట్ చేయటం జరుగును. 

 

2022 సంవత్సరం సంబందించి సమాచారం :

మొత్తం మూడు రకముల అవార్డులు ఇవ్వటం జరుగును.

  1. సేవా మిత్ర (Seva Mitra)
  2. సేవా రత్న (Seva Ratna)
  3. సేవా వజ్ర (Seva Vajra)

 

1) సేవా మిత్ర (Seva Mitra)

అర్హతలు : 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.

నగదు : 10,000/-

2) సేవా రత్న (Seva Ratna)

ఎవరికి : మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను మరియు మునిసిపల్ కార్పొరేషన్ కు 10 వాలంటీర్లకు అందిస్తారు. 

అర్హతలు :

  1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
  3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : 20,000/-

3) సేవా వజ్ర (Seva Vajra)

ఎవరికి : నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు. 

అర్హతలు :

  1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
  3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : 30,000/-

✦ అర్హతలు :

1. 2022 మార్చి 31 నాటికీ 1 సంవత్సరం పూర్తి సర్వీస్ కలిగి ఉండాలి.

2. పరిగణలోకి తీసుకోను సమయంలో ఎటువంటి ఫిర్యాదులు / అర్జీ లు వచ్చి ఉండకూడదు.

✦ పాయింట్ల వివరాలు :

1. బయోమెట్రిక్ హాజరు – 35 పాయింట్లు

2. పెన్షన్ పంపిణి – 35 పాయింట్లు

3. ఫీవర్ సర్వే – 30 పాయింట్లు

1.బయోమెట్రిక్ హాజరు అర్హత : 

పరిగణలోకి తీసుకోను నెలల్లో 4 సార్లు అయిన హాజరు వేసి ఉండాలి. ఆయా నెలలో 4 సార్లు హాజరు వేసి ఉంటే ఆ నెల మొత్తం 100% హాజరు పరిగనిస్తారు. ఆ విధం గా నెలకు కనీసం 4 సార్లు హాజరు వేసిన నెలలు ‘N’ అనుకుంటే హాజరుకు సంబందించిన మార్కులు = N×(35/12)

ఉదాహరణకు :

ఒక వాలంటీర్ ప్రతినెల కనీసం లో కనీసం నెలకు నాలుగుసార్లు బయోమెట్రిక్ హాజరు వేసినట్టయితే అవార్డుకు గానూ గత 4 నెలల ను పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు హాజరు సంబంధించిన మార్కులు = 4 × (35/12)

                 = 11.66

బయోమెట్రిక్ హాజరు రిపోర్ట్ లింక్ :

హాజరుకు సంబందించి కింద లింక్ (Click Here) పై క్లిక్ చేయండి. అందులో మీ జిల్లా, మండలం/మునిసిపాలిటీ, గ్రామం/వార్డు సచివాలయం సెలెక్ట్ చేసి, Category లో Volunteer సెలెక్ట్ చేయండి. ఒక సంవత్సరం హాజరు రిపోర్ట్ కావాలనుకుంటే అప్పుడు From Date వద్ద ఒక సంవత్సరం క్రితం తేదీ ను, To Date వద్ద ఏ రోజు వరకు రిపోర్ట్ కావాలో ఆ తేదీ ను సెలెక్ట్ చేసుకోవాలి



Click Here

2. పెన్షన్ పంపిణి అర్హత : 

ప్రతి నెల మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు పెన్షన్ పంపిణీ మరియు మొదటిరోజు 100% పెన్షన్ పంపిణీ పరిగణలోకి తీసుకోవడం జరుగును. 

పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్కులను ఇచ్చే విధానం

A. వాలంటీర్ కు 25 కన్నా తక్కువ పెన్షనర్లు ఉంటే :

 వాలంటీరు 100% పెన్షన్లను మొదటిరోజు పంపిణీ చేసినట్లయితే పూర్తి మార్కులు ఇవ్వడం జరుగును అంటే 35 మార్కులు ఇస్తారు లేని పక్షాన 15 మార్కులు ఇస్తారు.

B.వాలంటీర్ కు 25 లేదా 25 కన్నా ఎక్కువ పెన్షన్ దారులు ఉన్నట్టయితే :

[ [ మొదటి రోజు పెన్షన్ పంపిణీ × 35 ] + [ 2వ, 3వ 4వ 5వ రోజు పెన్షన్ పంపిణీ × 25 ] ] / మొత్తం పెన్షన్దారులు

ఉదాహరణకు :

A. వాలంటీర్ కు 20 పెన్షన్ లు ఉన్నట్టయితే అన్ని కూడా నెలలో మొదటి రోజు ఇస్తే వారికీ మార్కులు = 35, మొదటి రోజు కాకుండా మిగతా రోజుల్లో ఇస్తే అప్పుడు మార్కులు = 16

B. వాలంటీర్ కు 35 పెన్షన్ లు ఉన్నట్టయితే మొదటి రోజు 15 మరియు 2 వ రోజు 5, 3వ రోజు 4, 4వ రోజు 6 మరియు 5వ రోజు 2 పెన్షన్ లు ఇస్తే అప్పుడు మార్కులు = [15×35 ] + [ (5+4+6+2)×25] / 35

     = 12.14

3. ఫీవర్ సర్వే అర్హత :

డిసెంబర్ 2021 & జనవరి 2022 నెలల్లో 100% ఇళ్లకు ఫీవర్ సర్వ్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగును. ప్రతి ఫీవర్ సర్వే లో 100% ఇళ్లను కవర్ చేసినట్టయితే అప్పుడు ఫీవర్ సర్వేలో ఇళ్లను కవర్ చేసిన శాతం (N%) = [ మొత్తం కవర్ చేసిన హౌస్ హోల్డ్ సంఖ్య ] / [మొత్తం హౌస్ హోల్డ్ సంఖ్య ] ×100

మార్కులు = N% × 30

ఫీవర్ సర్వే రిపోర్ట్ :



Click Here

 

ఉదాహరణకు :

డిసెంబర్ 2021, జనవరి 2022 సర్వే లలో   

మొత్తం హౌస్ హోల్డ్ లు – 55

సర్వ్ చేసినవి – 44 అయితే అప్పుడు

సర్వే % = [ 44/55 ] ×100

              = 0.8

మార్కులు = 0.8×30 = 24

x